News August 27, 2024

MDK: గణేశుడిని నిలబెట్టేవారికి ముఖ్య గమనిక

image

➤పోలీస్ పర్మిషన్ తప్పనిసరి
➤కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం
➤మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు
➤కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి
➤DJలకు అనుమతి లేదు
➤రాత్రి 10 దాటిన తర్వాత మైక్‌లు ఆఫ్ చేయాలి
➤సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు
ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు
SHARE IT

Similar News

News November 17, 2024

గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతుంది..?: రఘునందన్ రావు

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఐపీ, ఓపి విభాగాలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని. X-ray తీయించుకోవడానికి 2,3 రోజులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి అన్నారు. ఆరోగ్య శాఖ పనితీరు ఇదేనా..? అని X వేదికగా ఎంపీ నిలదీశారు.

News November 17, 2024

మెదక్: రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం ఎన్నిక

image

మెదక్ జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కానుగు రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఆదివారం మెదక్ లో ఎన్నికలు నిర్వహించారు. జనరల్ సెక్రెటరీగా విద్యాసాగర్, ట్రెజరర్‌గా రాజు, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్‌గా జాయింట్ సెక్రటరీలుగా బి. కిషన్, పి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అస్లాం ఖాన్, పోచయ్య, గౌరవాధ్యక్షుడిగా పి. శెట్టయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బాలకిషన్, యాదగిరి, అనిల్ ఎన్నికయ్యారు.

News November 17, 2024

ఝరాసంగం: పాము కాటుతో విద్యార్థి మృతి

image

పాముకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన ఝరాసంగం మండల మంచునూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాలు.. ధనసిరి బాబు, మీనా దంపతుల కుమారుడు భాను ప్రసాద్ (12) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. పొలం వద్ద పత్తి చేనులో పాము కాటుకు గురయ్యాడు. జహీరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.