News September 12, 2024

MDK: సెప్టెంబర్ 17.. ముఖ్య అతిథి ఈయనే..!

image

రాష్ట్రంలో సెప్టెంబర్ 17న’ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మెదక్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు హాజరుకానున్నట్లు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోజు ఉదయం పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారు. ఇందు కోసం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News September 29, 2024

HYD: దూరవిద్య కోర్సుల పరీక్ష తేదీల ఖరారు!

image

PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.

News September 29, 2024

రాష్ట్రపతి నిలయం కళా మహోత్సవానికి వర్గల్ నవోదయ విద్యార్థులు

image

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన అతిపెద్ద కళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వర్గల్ జవహర్ నవోదయ విద్యార్థులు 25 మంది పాల్గొన్నారని ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు భారతీయ కళా మహోత్సవంలో 430 మంది పాల్గొంటున్నారు.

News September 29, 2024

సంగారెడ్డి: DSC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పొడిగింపు

image

డీఎస్సీ -2008కి ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు పెంచుతున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రభుత్వ పనిదినాలైన సెప్టెంబర్ 30, అక్టోబర్ 1,3,4,5 తేదీల్లో డిఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.