News April 25, 2025
MDM: ‘1973 మందికి కారుణ్య నియామకాలు’

మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాల్యుయేషన్ డిపెండెంట్ ఒకరికి జీఎం దేవేందర్ కారుణ్య నియామకపత్రం అందజేశారు. మందమర్రి ఏరియాలో ఇప్పటివరకు 1973 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చినట్లు జీఎం పేర్కొన్నారు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే సింగరేణిలో పని స్థలాలు, సమయాలు భిన్నంగా ఉంటాయన్నారు. విధులకు గైర్హాజరయితే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు.
Similar News
News April 25, 2025
ఏలూరు: సీఎం, డిప్యూటీ సీఎంకి హరిరామజోగయ్య లేఖ

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో కాపులకు EWS కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 103 రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాపుల అభ్యున్నతికి తోడ్పడవల్సిందిగా ఆ వర్గం తరఫున కోరుతున్నానని పేర్కొన్నారు.
News April 25, 2025
మరో మైలురాయికి చేరువైన ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో మైలురాయి చేరనుంది. ఇవాళ SRHతో జరిగే మ్యాచుతో టీ20ల్లో 400 మ్యాచులు ఆడిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలవనున్నారు. ఆయన కంటే ముందు రోహిత్ శర్మ(456), దినేశ్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(407) ఉన్నారు. ఇప్పటివరకు 399 మ్యాచుల్లో 38 సగటుతో 7,566 పరుగులు చేశారు. ఇందులో 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
News April 25, 2025
కాకినాడ: సీఎం, డిప్యూటీ సీఎంకి హరిరామజోగయ్య లేఖ