News September 21, 2024
నేను ఏసీ వ్యాన్‌లో.. రజనీ నేలమీద: అమితాబ్

రజనీకాంత్ వెట్టయాన్ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌కు ఆయన తన వీడియో మెసేజ్‌ను పంపించారు. ‘ఇది నా తొలి తమిళ సినిమా. 1991లో వచ్చిన హమ్ సినిమాలో నేను, రజనీ కలిసి నటించాం. ఆ షూటింగ్లో నేను ఏసీ కారవ్యాన్‌లో పడుకుంటే తను మాత్రం సెట్లో నేలపై నిద్రించేవారు. ఆ సింప్లిసిటీ చూశాక నేనూ బయటే పడుకునేవాడిని’ అని గుర్తుచేసుకున్నారు.
Similar News
News October 30, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. మరి ఎమ్మెల్సీ ఎప్పుడు?

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన MLA/MLC కాదు. ఈ రెండూ కాకపోయినా మంత్రివర్గంలో చేరవచ్చు. 6 నెలల్లోపు ఏదో ఒక పదవికి ఎన్నిక కావాలి. లేదంటే మంత్రి పదవి కోల్పోవాల్సిందే. గవర్నర్ కోటా MLCలుగా అజహరుద్దీన్, కోదండరామ్ పేర్లను ప్రభుత్వం 2నెలల కిందట సిఫారసు చేయగా గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News October 30, 2025
US కీలక నిర్ణయం.. ఇండియన్స్‌కు భారీ నష్టం!

ఎంప్లాయిమెంట్ ఆటోమేటిక్ ఆథరైజేషన్‌ను రద్దు చేస్తూ US నిర్ణయం తీసుకుంది. గతంలో వర్క్ పర్మిట్ రెన్యూవల్‌కు అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నా 540 రోజులు వర్క్ చేసే వీలుండేది. ఇప్పుడు గడువు ముగిసేలోగా రెన్యూవల్ కాకపోతే మైగ్రెంట్స్ వర్క్ పర్మిట్ ఆథరైజేషన్ కోల్పోతారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ స్పౌజెస్(H4), H1Bs వీసా, STEM వర్క్ ఎక్స్‌టెన్షన్స్‌పై ఉన్న విద్యార్థులు, ఇండియన్ మైగ్రెంట్స్ నష్టపోయే ప్రమాదం ఉంది.
News October 30, 2025
PPPపై జోక్యానికి హైకోర్టు మరోసారి నిరాకరణ

AP: రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా హాస్పిటల్స్‌ను PPP విధానంలో నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు మరోసారి నిరాకరించింది. ‘ప్రారంభ దశలోనే ఉన్న టెండర్ ప్రక్రియను ఆపలేం. ప్రభుత్వం పిలవగానే ఇన్వెస్టర్స్ డబ్బు సంచులతో పరిగెత్తుకురారు కదా’ అని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సమయమిస్తూ.. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.


