News March 5, 2025
ప్రభుత్వ హాస్టళ్లలో బీపీటీ రైస్‌తో భోజనం: మంత్రి స్వామి

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో బీపీటీ రైస్‌తో భోజనం అందించనున్నట్లు మంత్రి డీబీవీ స్వామి అసెంబ్లీలో తెలిపారు. వసతి గృహాల్లో ఆర్వో ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, భోజనం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పోస్టుమెట్రిక్ విద్యార్థులకు కార్పెట్ బెడ్ షీట్లు, టవళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.
Similar News
News March 5, 2025
TTD Update: నేరుగా శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తోంది. నిన్న శ్రీవారిని 64,861 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.65 కోట్ల ఆదాయం సమకూరింది.
News March 5, 2025
KCR వ్యూహం.. ఒకరా? ఇద్దరా?

TG: MLAల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా BRS అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. MLAల సంఖ్యా పరంగా BRSకు ఒక స్థానం కచ్చితంగా దక్కనుండగా, రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఓటింగ్ తప్పనిసరి కానుంది. దీంతో పార్టీ మారిన 10 మంది MLAల ఓటు కీలకం కానుంది. వీరిని ఇరుకున పెట్టాలని KCR భావిస్తున్నారు.
News March 5, 2025
మెక్సికో, కెనడాకు ట్రంప్ స్వల్ప ఊరట?

మెక్సికో, కెనడాపై విధించిన భారీ సుంకాల విషయంలో స్వల్ప మార్పులు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ దేశాల విజ్ఞప్తుల్ని పరిగణించి టారిఫ్‌లను కొంత మేర తగ్గించొచ్చని US వాణిజ్య మంత్రి హొవార్డ్ లుత్నిక్ తెలిపారు. మరోవైపు.. తమ దేశాన్ని ఆక్రమించాలన్న ప్రణాళికతోనే ట్రంప్ భారీగా సుంకాల్ని విధించారని కెనడా PM జస్టిన్ ట్రూడో ఆరోపించడం గమనార్హం.