News September 24, 2024
ట్రిపుల్ ఐటీల్లో రేషన్ బియ్యంతో భోజనం: TDP ఎమ్మెల్సీ

AP: ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని టీడీపీ MLC భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్‌కు ఆయన లేఖ రాశారు. నిర్వాహకులు రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించి విద్యార్థులకు పెడుతున్నారని ఆక్షేపించారు. మసూరి రకం బియ్యాన్నే వాడాలన్న నిబంధనను పట్టించుకోవట్లేదని విమర్శించారు. IIITల్లో క్యాంటీన్లు, దుకాణాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించాలని కోరారు.
Similar News
News October 22, 2025
TTD: 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు

AP: తిరుమల శ్రీవారి ట్రస్టులకు గత 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు, ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్లను దాతలు అందించారు. ఆన్లైన్లో రూ.579.38 కోట్లు, ఆఫ్‌లైన్‌లో రూ.339.2 కోట్లు వచ్చాయి.
News October 22, 2025
పేల సమస్యకు ఈ డివైజ్‌తో చెక్

వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది మహిళలకు పేల సమస్య ఉంటుంది. వాటిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ హెడ్ లైస్ కోంబ్. చూడటానికి ట్రిమ్మర్‌లా కనిపించే ఈ డివైజ్ పేలతో పాటు, వాటి గుడ్లనూ ఫిల్టర్‌లోకి లాగేస్తుంది. తర్వాత డివైజ్‌ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి.
News October 22, 2025
సుడిదోమ, పచ్చదోమ కట్టడికి లైట్ ట్రాప్స్

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.