News September 4, 2024
ఇకపై బుడమేరు ముంపు రాకుండా చర్యలు: CM
AP: ఇకపై బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని CM CBN తెలిపారు. ‘బుడమేరు వాగును స్ట్రీమ్ లైన్ చేస్తాం. వాగు నీరు నేరుగా కృష్ణా నదికి వచ్చేలా ఉండే అడ్డంకులు తొలగిస్తాం. విజయవాడకు భవిష్యత్తులో నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడతాం. గోదావరి వరదను పర్యవేక్షిస్తున్నాం. ఇంటింటికి ఆహారం సరఫరా చేస్తాం. పశువులకు దాణా అందిస్తాం. అస్నా తుఫాను ఇటు రాదంటున్నారు. అయినా అలర్ట్‌గా ఉంటాం’ అని చెప్పారు.
Similar News
News February 3, 2025
ఎమ్మెల్సీ ఎలక్షన్స్.. ఇవాళ నోటిఫికేషన్
MLC ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. APలోని ఉ.గోదావరి, కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ టీచర్ స్థానానికి ఎలక్షన్స్ జరగనున్నాయి. TGలోని వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.
News February 3, 2025
అభిషేక్ హిట్టింగ్.. నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్: బట్లర్
చివరి టీ20లో 135 పరుగులతో చెలరేగిన అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రశంసలు కురిపించారు. తాను ఇప్పటి వరకు ఎంతో క్రికెట్ చూశానని, అయితే అభిషేక్ హిట్టింగ్ తాను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ అని వెల్లడించారు. హోం సిరీస్‌లలో భారత్ అద్భుతమైన జట్టు అని చెప్పారు. సిరీస్ కోల్పోవడం బాధగా ఉందన్నారు. వన్డేల్లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
News February 3, 2025
15న పార్లమెంటులో ‘రామాయణం’ ప్రదర్శన
‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ యానిమేటెడ్ చిత్రాన్ని ఈ నెల 15న పార్లమెంటులో ప్రదర్శించనున్నట్లు గీక్ పిక్చర్స్ వెల్లడించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపింది. 1993లో ఈ సినిమాను ఇండో-జపనీస్ టీమ్ తెరకెక్కించింది. 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. రచయిత విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి రైటర్‌గా పనిచేశారు.