News September 27, 2024

‘పూరీ’ మహాప్రసాదం నాణ్యత కోసం యంత్రాంగం: ఒడిశా

image

పూరీ జగన్నాథ ఆలయంలో ఇచ్చే మహాప్రసాదాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచంద్రన్ తాజాగా ప్రకటించారు. నెయ్యి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రసాదం తయారీ గదిలోకి కఠిన పరీక్షల తర్వాతే ఏ పదార్థమైనా వెళ్లేలా నిబంధనల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Similar News

News December 21, 2024

తొక్కిసలాట దురదృష్టకర ఘటన: అల్లు అర్జున్

image

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఒక దురదృష్టకర ప్రమాదమని అల్లు అర్జున్ అన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఘటనలో ఎవరి తప్పూ లేదని ప్రెస్‌మీట్లో చెప్పారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు తాను ప్రెస్‌మీట్ పెట్టలేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం గురించి దుష్ప్రచారం చేస్తుండటం బాధిస్తోందన్నారు.

News December 21, 2024

అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ ఆలస్యం.. కొనసాగుతున్న ఉత్కంఠ

image

అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. రా.7 గంటలకు మీడియా సమావేశం ఉంటుందని ప్రెస్‌కు సమాచారం ఇవ్వడంతో అంతా ఆయన ఇంటి వద్ద వేచి చూస్తున్నారు. కానీ రా.8 గంటలు కావొస్తున్నా అర్జున్ ఇంకా బయటికి రాకపోవడంతో మీడియా ప్రతినిధులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఆయన అభిమానులు కూడా బన్నీ ప్రెస్‌మీట్ ఎప్పుడు ఉంటుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News December 21, 2024

వాయుగుండం.. రేపు, ఎల్లుండి వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తూర్పు-ఈశాన్య దిశగా కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు 430కి.మీ, చెన్నైకి 490కి.మీ, గోపాల్‌పూర్(ఒడిశా)నకు 580కి.మీ దూరంలో ఉందని పేర్కొంది. ఆ తర్వాత సముద్రంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.