News July 20, 2024
MED, MPED 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో MED, MPED 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఫలితాలను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫలితాల కోసం ఏయూ వెబ్సైట్ను సందర్శించాలి.
Similar News
News November 24, 2025
విశాఖ తీరంలో విషాదం.. మరో మృతదేహం లభ్యం

విశాఖ లైట్ హౌస్ బీచ్లో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఘటన విషాదాంతమైంది. ఆదివారం తేజేశ్ మృతదేహం లభ్యం కాగా, సోమవారం ఉదయం ఆదిత్య మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. సముద్ర స్నానానికి దిగి అలల ధాటికి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News November 24, 2025
బిజీబిజీగా విశాఖ పోలీసుల షెడ్యూల్

విశాఖలో పోలీసు యంత్రాంగం బిజీ బిజీ షెడ్యూల్తో విధులు నిర్వహిస్తున్నారు. వారం క్రితం CII సమ్మెట్ సభలును విజయవంతంగా విధులు నిర్వహించిన పోలీసులకు వరుసగా మూడు కార్యక్రమాలు జరగనున్నడంతో సవాల్గా మారింది. కనకమాలక్ష్మి దేవస్థానం పండుగ ఉత్సవాలు. మేరీ మాత ఉత్సవాలు, ఇండియా-సౌత్ ఆఫ్రికా వన్డే క్రికెట్ మ్యాచ్కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలుతో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 24, 2025
విశాఖ: ప్రియరాలితో వాగ్వాదం.. ప్రియుడి ఆత్మహత్య

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో నిన్న రాత్రి వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన రాజేశ్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. వ్యాన్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


