News March 17, 2024
మెదక్: ఆటో డ్రైవర్ ఆత్మహత్య
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండముల కిరణ్ (23) అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News October 31, 2024
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.
News October 30, 2024
సంగారెడ్డి: టెన్త్ ప్రత్యేక తరగతుల సమయంలో మార్పులు
పదో తరగతి ప్రత్యేక తరగతుల సమయంలో మార్పులు చేస్తూ సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ.. సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.
News October 30, 2024
మెదక్: మోత మోగుతున్న ‘టపాసుల’ ధరలు !
ఉమ్మడి మెదక్ జిల్లాలో టపాసుల ధరలు మోత మోగుతున్నాయి. షాపుల అనుమతి, ఇతరత్రాకు సంబంధించి మామూళ్లు చెల్లించిన వ్యాపారులు ఆ భారమంతా వినియోగదారులపై మోపుతున్నారు. భారీగా పెరిగిన టపాసుల ధరలతో ఈ ఏడాది సాధారణ, మధ్యతరగతి వారు టపాసులు కొనాలంటేనే జంకుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాకర పుల్ల నుంచి 1000 వాలా వరకు టపాసుల ధరలు 30% పెరిగాయి. వ్యాపారులు వారి నోటికి ఎంత వస్తే అంతే చెప్పి ధరలు పిండుకుంటున్నారు.