News March 17, 2024
మెదక్ ఎంపీ స్థానంపై వీడని పీటముడి

మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో పీటముడి వీడటం లేదు. టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశిస్తున్నారు. మల్కాజ్గిరి టికెట్‌పై సైతం ఆశలు పెట్టుకున్నారు. అక్కడ ఇవ్వకుంటే మెదక్ టికెట్ అయినా ఖరారు చేయాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. పటాన్‌చెరుకు చెందిన నీలం మధు, మైనంపల్లి టికెట్ పోటీలో ఉండగా అధిష్ఠానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందో చూడాలి.
Similar News
News April 3, 2025
వేసవి సెలవులు.. మీ పిల్లలు జాగ్రత్త: మెదక్ ఎస్పీ

మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే మీ జీవితంలో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలించవద్దని అన్నారు. వేసవి సెలవులు వస్తున్నాయని, మీ పిల్లలు బావులు, చెరువుల, వాగుల్లో ఈతకు వెళ్లే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
News April 3, 2025
MDK: ఈనెల 4న విద్యుత్ సమస్యలపై గ్రీవెన్స్

విద్యుత్ వినియోగదారుల సమస్యలపై మెదక్ జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 4న సి.జి.ఆర్.ఎఫ్(కస్స్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఫోరమ్) హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌డే నిర్వహించనున్నట్టు మెదక్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏ.శంకర్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి హాజరయ్యేవారు ఆధార్ కార్డు, కరెంటు బిల్లు రసీదు తీసుకొని రావాలని సూచించారు.
News April 2, 2025
‘పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి’

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం ఐడిఓసిలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలకు అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.