News August 2, 2024
ఒలింపిక్స్లో మెడల్స్.. ఏడింతలు పెరిగిన బ్రాండ్ వాల్యూ!

ఒలింపిక్స్లో సంచలనం సృష్టించిన భారత క్రీడాకారిణి మను భాకర్ ఇమేజ్ను వాడుకునేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఒలింపిక్స్ మెడలిస్ట్తో ప్రకటనల కోసం దాదాపు 40 బ్రాండ్స్ ఆమె టీమ్ను సంప్రదించాయట. ఇప్పుడు ఆమె బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరిగిందని, గతంలో రూ.20 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.1.5 కోట్లకు పెరిగినట్లు సమాచారం. కాగా, అనధికారికంగా తన ఫొటోను వాడుకున్న కంపెనీలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
Similar News
News November 27, 2025
నెల్లూరు జిల్లాకు మరోసారి భారీ వర్షం..!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 29, 30 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో ఈ ప్రభావం నెల్లూరు జిల్లాపై ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News November 27, 2025
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.


