News September 5, 2024
నేటి నుంచి వరద ప్రాంతాల్లో వైద్య శిబిరాలు

AP: విజయవాడలో వరద తగ్గడంతో అంటువ్యాధులు, వైరల్ ఫీవర్లు సోకకుండా ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. నగరంలోని 32 డివిజన్లలో ఇవాళ్టి నుంచి అదనంగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనుంది. ప్రతి వార్డు పరిధిలోని సచివాలయాలు, అంగన్‌వాడీ, ప్రభుత్వ కేంద్రాల్లో ఇద్దరు చొప్పున వైద్యులు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం 104 మెడికల్ వెహికల్స్, 50కి పైగా వైద్య శిబిరాలు సేవలందిస్తున్నాయి.
Similar News
News March 1, 2025
రేపటి నుంచి దబిడి దిబిడే..

TG: ఆదివారం నుంచి రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిత్యం 36-38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంటూ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అటు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. MAR, APR, MAY నెలల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది.
News March 1, 2025
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉ.9 – మ.12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 10.58 లక్షల మంది పరీక్షలు రాయనుండగా నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్’ జోన్‌గా ప్రకటించారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయాలని విద్యార్థులకు Way2News సూచిస్తోంది. ALL THE BEST.
News March 1, 2025
సెమీస్‌కు వెళ్లాలని సౌతాఫ్రికా.. పరువు కోసం ఇంగ్లండ్

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ మ.2.30 గంటలకు సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్-బిలో 3 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్న SA ఇందులో గెలిచి సెమీస్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న ENG చివరి గేమ్‌లోనైనా గెలవాలని ఆరాటపడుతోంది. ఇప్పటికే AUS సెమీస్‌లో అడుగుపెట్టింది. ENG చేతిలో SA భారీ తేడాతో ఓడితే అఫ్గాన్ సెమీస్ చేరుతుంది.