News September 18, 2024
రాత్రికి రాత్రి మెడికల్ కాలేజీలు కట్టలేం: విడదల రజినీ

AP: రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, ఐదేళ్లలో ఐదు పూర్తి చేశామని మాజీ మంత్రి విడదల రజినీ తెలిపారు. రాత్రికి రాత్రే అన్ని కళాశాలలను కట్టలేమని ఆమె చెప్పారు. ‘వందేళ్లలో కేవలం 11 కాలేజీలే కట్టారు. అలాంటిది ఐదేళ్లలోనే ఐదు కట్టాం. మరో ఐదు కాలేజీలు నిర్మాణదశలో ఉన్నాయి. మిగతా కళాశాలలను కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలి. సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
GP నిధులు ఇలా చెక్ చేసుకోండి

GP నిధులను విత్ డ్రా చేయాలంటే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి/ఉప సర్పంచ్ ఉమ్మడి సంతకం(డిజిటల్ కీ) అవసరం. egramswaraj.gov.inలో GPకి కేటాయించిన, ఖర్చు చేసిన నిధుల వివరాలను గ్రామస్థులు తెలుసుకోవచ్చు. హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేస్తే ఉండే రిపోర్ట్స్ సెక్షన్లో ప్లానింగ్ అండ్ రిపోర్టింగ్పై క్లిక్ చేయాలి. తర్వాత రాష్ట్రం, జిల్లా, మండలం/బ్లాక్, గ్రామ పంచాయతీని ఎంచుకొని ‘గెట్ రిపోర్ట్’లో వివరాలు చూడవచ్చు.
News December 19, 2025
వీరు బాదం పప్పులు తినకూడదు

బాదం పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. శీతాకాలంలో బాదం తినడం వల్ల శరీరానికి వెచ్చదనం, శక్తి లభిస్తుందని కూడా అంటారు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు వీటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు, జీర్ణ సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్, అసిడిటీ ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదంటున్నారు.
News December 19, 2025
వరి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

వరి కోతల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వరి వెన్నులో 80-90 శాతం గింజలు పసుపు రంగుకు మారుతున్నప్పుడు కర్ర పచ్చి మీద పంటను కోయాలి. పంట పక్వానికి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గడంతోపాటు, గింజలపై పగుళ్లు ఏర్పడతాయి. గింజలలో తేమ తగ్గించడానికి 4-5 రోజులు చేనుపైనే ఎండనివ్వాలి. పనలను తిరగదిప్పితే సమానంగా ఎండుతాయి. పంటను ముందుగా కోస్తే ధాన్యంలో పచ్చి గింజలు ఎక్కువగా ఉంటాయి.


