News January 21, 2025

ఆ పెన్షన్ దారులందరికీ వైద్య పరీక్షలు

image

AP: దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్లు, చేతులు దెబ్బతినడంతో రూ.6వేలు పెన్షన్ పొందుతున్నవారికి ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది. రాష్ట్రంలోని సుమారు 7లక్షల మంది లబ్ధిదారుల్లో 40% అనర్హులు ఉండొచ్చని అంచనా. అవయవాలు బాగానే ఉన్నా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్లూ డబ్బులు తీసుకున్నవారి పెన్షన్ కట్ కానుంది.

Similar News

News February 3, 2026

కాళ్లకల్‌లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండలం కాల్లకల్‌లో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి కుమార్(25) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాళ్లకల్‌లో గత కొన్ని రోజులుగా నివాసం ఉంటూ స్థానిక పరిశ్రమలో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

News February 3, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB-3, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 3, 2026

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న క్వాంటం వ్యాలీకి ఈ నెల 6న శంకుస్థాపన జరగనుంది. దీని కోసం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో 50 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.