News September 22, 2024

జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థులు

image

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. తొలుత ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు. ఏలూరులోని ఓ మెడికల్ కాలేజీ నుంచి 14 మందికిపైగా వైద్య విద్యార్థులు ఇవాళ టూర్‌కు వచ్చారు.

Similar News

News October 25, 2025

ఇతర పదవుల్లో ఉండే వారికి DCC రాదు: PCC చీఫ్

image

TG: సమర్థులను DCC అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. కనీసం 5ఏళ్లు పార్టీలో పనిచేసి ఉండాలన్న నిబంధన ఉంది. మ.3కు అధిష్ఠానం CM, Dy.CMతో పాటు నా అభిప్రాయం తీసుకొని లిస్టు ఫైనల్ చేస్తుంది. సామాజిక న్యాయం ప్రకారం ఎంపిక ఉంటుంది. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి DCC ఇవ్వరాదనే నియమం ఉంది. అలాంటి వారికి ఈ పదవి రాదు’ అని స్పష్టం చేశారు.

News October 25, 2025

ఫ్లవర్‌వాజ్‌లో పూలు తాజాగా ఉండాలంటే..

image

ఫ్లవర్ వాజ్‌లో ప్లాస్టిక్ పువ్వులకు బదులు రియల్ పువ్వులను పెడితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇవి త్వరగా వాడిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే పువ్వులను ఫ్లవర్‌వాజ్‌లో పెట్టేటప్పుడు వాటి కాడలను కొంచెం కట్ చేయాలి. అలాగే ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తుండాలి. ఇందులో కాపర్ కాయిన్/పంచదార/ వెనిగర్ వేస్తే పువ్వులు ఫ్రెష్‌గా ఉంటాయి. ఫ్లవర్‌వాజ్‌ను నేరుగా ఎండ తగిలే ప్లేస్‌లో ఉంచకూడదు.

News October 25, 2025

బిహార్‌లో గెలిచేది ఎన్డీయేనే.. నేనూ ప్రచారం చేస్తా: CM చంద్రబాబు

image

AP: ఈ దశాబ్దం ప్రధాని మోదీదే అని CM చంద్రబాబు అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయం సాధిస్తుందని, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రజలను శక్తిమంతులను చేయాలనే లక్ష్యంతో NDA ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పవర్‌లోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.