News February 27, 2025

పోసానికి వైద్యపరీక్షలు.. విచారిస్తున్న ఎస్పీ

image

AP: పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSకు తీసుకొచ్చిన పోలీసులు.. అక్కడే వైద్యుడితో మెడికల్ టెస్టులు చేయించారు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేశ్ వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు పెద్దఎత్తున అనుచరులతో PSకు రాగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.

Similar News

News February 27, 2025

PAKISTAN: ఆదాయం 6.. ఖర్చు 60..!

image

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ భారీగా ఖర్చు చేసింది. దాదాపు రూ.591 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క మ్యాచూ గెలవకుండానే లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటిబాట పట్టింది. గ్రూప్ స్టేజీలో ఓడిన జట్లకు ఐసీసీ రూ.2.3 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. ఇది చూసిన నెటిజన్లు పీసీబీపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆదాయం 6.. ఖర్చు 60 అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇకనైనా పీసీబీ తీరు మారాలని కామెంట్లు చేస్తున్నారు.

News February 27, 2025

పోలీసుల విచారణకు సహకరించని పోసాని?

image

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు 4 గంటలుగా విచారిస్తున్నా ఆయన నోరు మెదపడం లేదని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా మౌనంగా కూర్చుంటున్నారని, ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందని వారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.

News February 27, 2025

ఎల్లుండి ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’

image

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఎల్లుండి(మార్చి 1) ఓటీటీలోకి రానుంది. సా.6గంటల నుంచి అటు జీతెలుగులో ప్రసారం కానుండగా ఇటు జీ5 యాప్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. జీ5 తాజాగా తన యాప్‌లో విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది. వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!