News March 27, 2025
పెరగనున్న మెడిసిన్స్ ధరలు

ఔషధాల ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డ్రగ్స్ కంట్రోల్ సిద్ధమవుతోంది. దేశంలో అత్యధిక మంది వాడే షుగర్ మాత్రలతో పాటు క్యాన్సర్, గుండె సమస్యలు తదితర మెడిసిన్స్ రేట్లు ప్రియం కానున్నాయి. వీటి ధరలు 1.7శాతం పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ తెలిపారు. మరో 2,3 నెలల్లో కొత్త రేట్లు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
గ్రీన్ క్రాకర్స్ సురక్షితమేనా?

పొల్యూషన్ తగ్గించేందుకు వాడే <<18010671>>గ్రీన్ క్రాకర్స్<<>> కూడా పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ క్రాకర్స్‌తో పోలిస్తే పొగ, శబ్దం తక్కువ చేసినప్పటికీ వీటి నుంచి వెలువడే అల్ట్రాఫైన్ పార్టికల్స్ ఊపిరితిత్తులు, రక్తంలోకి చేరే ప్రమాదముందని చెబుతున్నారు. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.
News October 16, 2025
రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధం: రోహత్గీ

‘ఓటుకు నోటు’ కేసులో నిందితులు రేవంత్, సండ్ర వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది రోహత్గీ పేర్కొన్నారు. FIR నమోదవ్వకముందే ఉచ్చు పన్ని కేసు పెట్టడం అన్యాయమన్నారు. ACB సెక్షన్ల ప్రకారం లంచం తీసుకోవడం మాత్రమే నేరమని వాదించారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రేపు కూడా విచారణ కొనసాగనుంది.
News October 16, 2025
మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారు: బన్నీ వాసు

టికెటింగ్ సంస్థ బుక్ మై షో సంస్థపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు అసహనం వ్యక్తం చేశారు. వారి యాప్, సైట్లో సినిమాలకు అసలు రేటింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. ‘జర్నలిస్టులు నిర్మాణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కదా. మరి మీ రేటింగ్స్‌తో పనేముంది. అసలు సినిమా టికెట్ కొనే సమయంలో ఈ మూవీ బాగుంది, ఇది బాలేదు అని రేటింగ్ ఇవ్వడమేంటి? మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారని గుర్తు పెట్టుకోండి’ అని తెలిపారు.