News April 2, 2024
మేడిగడ్డ కాళేశ్వరానికి వెన్నెముక: సీఎం రేవంత్

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేడిగడ్డ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నెముక వంటిది. వెన్నెముక విరిగితే మనిషి పని చేయలేడు. మేడిగడ్డ పరిస్థితి కూడా అంతే. అక్కడి నుంచి నీళ్లు కిందికి వదిలింది కేసీఆర్ ప్రభుత్వమే. మిగతా పిల్లర్లకు ప్రమాదమని, నీళ్లు వదలాలని కేంద్ర బృందం చెప్పింది. అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది’ అని చెప్పారు.
Similar News
News January 23, 2026
మోదీకి మద్దతు ఎందుకు: YS షర్మిల

AP: రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయడంలోనూ, అమరావతికి రాజధాని హోదా కల్పించడంలోనూ మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. VB-G RAM G బిల్లులోని 60:40 విధానం వలన ఏపీపై భారం పడుతుందంటూనే మరోవైపు సాయం కోరడంపై ఆగ్రహించారు. తొలుత బిల్లుకు ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. మోదీకి చంద్రబాబు మద్దతు కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
News January 23, 2026
మేడారం జాతరకు కేంద్రం నిధులు విడుదల

TG: మేడారం జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి జరగనున్న వేడుకల్లో వసతుల కోసం అధికారులు వీటిని ఖర్చు చేయనున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘గిరిజన సర్క్యూట్ పేరిట’ రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.
News January 23, 2026
త్వరలో బీజేపీలోకి శశిథరూర్?

కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి పార్టీ MP శశిథరూర్ గైర్హాజరయ్యారు. అదే సమయంలో తిరువనంతపురంలో జరిగిన PM మోదీ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే మోదీ పాలనను ప్రశంసించిన థరూర్ను INC దూరం పెట్టినట్లు ప్రచారం ఉంది. ఇటీవల రాహుల్ ఓ ప్రసంగంలో తన పేరును విస్మరించడంతో థరూర్ అసంతృప్తిగానూ ఉన్నారు. ఈ పరిణామాలతో ఆయన త్వరలోనే BJPలో చేరొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.


