News July 27, 2024

‘మేడిగడ్డ’ రాజకీయం: కాంగ్రెస్ vs బీఆర్‌ఎస్

image

‘ఆగస్టు 2 నాటికి మేడిగడ్డ సమీపంలోని కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేయకపోతే 50 వేల మంది రైతులతో మోటార్లు ఆన్ చేస్తాం’ అని కేటీఆర్.. ‘మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే ప్రమాదం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబితేనే నిల్వ చేస్తాం’ అని మంత్రి ఉత్తమ్. తెలంగాణలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. మేడిగడ్డలో సమస్యలు లేకున్నా KCRపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News February 23, 2025

ప్లాస్టిక్ రహిత పెళ్లి

image

TG: ఖమ్మం జిల్లాలో ఓ జంట వినూత్న రీతిలో పెళ్లి చేసుకుంది. వెంకటాయపాలెంలో సంపత్, నవ్య ఒక్క ప్లాస్టిక్ వస్తువు లేకుండా పెళ్లి తంతు ముగించారు. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు అరిటాకులు, మట్టి గ్లాసులు.. ఇలా ప్రతిదీ పర్యావరణహితమైనవే వాడారు. అందరూ ఈ జంటను స్ఫూర్తిగా తీసుకుని ప్లాస్టిక్ భూతాన్ని పక్కనబెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

News February 23, 2025

ఐసీసీ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ భేటీ

image

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్‌లో ఐసీసీ ఛైర్మన్ జైషాతో భేటీ అయినట్లు AP మంత్రి లోకేశ్ తెలిపారు. ‘జైషాను కలవడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడంపై ఆయనతో చర్చించా. మా ఇద్దరికీ ఇది చాలా ఇష్టమైన అంశం’ అని జైషాతో తీసుకున్న ఫొటోను Xలో పోస్ట్ చేశారు. ఈ మ్యాచుకు తన కొడుకు దేవాన్ష్‌ను కూడా ఆయన తీసుకెళ్లారు.

News February 23, 2025

ఆ జిల్లాల్లో 3 రోజులు వైన్ షాపులు బంద్

image

TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ADB, కరీంనగర్, వరంగల్, NLG, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

error: Content is protected !!