News December 9, 2024

అందుబాటులోకి ‘మీ సేవ’ మొబైల్ యాప్‌

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మీ సేవ’ మొబైల్ యాప్‌ను మంత్రి శ్రీధర్ బాబు లాంచ్ చేశారు. ఈ యాప్ ద్వారా ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందవచ్చు. కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. బిల్లుల చెల్లింపులు చేయవచ్చు. ఈ యాప్‌తో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే టీ ఫైబర్ నెట్ సేవలనూ ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అమలు చేయనుంది.

Similar News

News October 31, 2025

మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

image

AP: మాజీ MLA సివేరి సోమా కుమారుడు సురేశ్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. జోన్-1లో డిప్యూటీ తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 3(b) కింద ప్రత్యేక పరిస్థితుల్లో రిక్రూట్‌మెంట్‌లో ఈ స్థానాన్ని భర్తీ చేసినట్లు పేర్కొంది. 2018 SEP 28న నక్సల్స్ కాల్పుల్లో సివేరి సోమా ప్రాణాలు కోల్పోయారు.

News October 31, 2025

అండాశయ క్యాన్సర్‌కు కారణాలివే..

image

ఒవేరియన్ క్యాన్సర్‌కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ వరకూ దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తారు నిపుణులు. విడుదలయ్యే అండాల సంఖ్య తగ్గితే అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా ఉన్నా, పిల్లలు లేకపోయినా, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా, హార్మోన్ చికిత్స తీసుకున్నా దీని ముప్పు పెరుగుతుంది.

News October 31, 2025

అండాశయ క్యాన్సర్ లక్షణాలు

image

చాలామంది మహిళలు మెనోపాజ్ లక్షణాలను విస్మరిస్తుంటారు. అండాశయ క్యాన్సర్‌కూ కొన్నిసార్లు ఇవే లక్షణాలుంటాయంటున్నారు నిపుణులు. పొత్తికడుపు ఉబ్బరం, బరువు తగ్గడం, కటి ప్రాంతంలో అసౌకర్యం, అలసట, వెన్నునొప్పి, జీర్ణక్రియలో ఇబ్బంది, సెక్స్ సమయంలో నొప్పి వంటి లక్షణాలుంటాయి. కాబట్టి ఏవైనా అసాధారణ లక్షణాలు, మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.