News July 23, 2024
వరుస సినిమాలతో బిజీగా మీనాక్షి
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, విశ్వక్‌సేన్ ‘మెకానిక్ రాకీ’, వరుణ్ తేజ్ ‘మట్కా’ తదితర చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తమిళ స్టార్ విజయ్ నటించిన ‘GOAT’లో ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. సీనియర్, జూనియర్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయారు మీనాక్షి.
Similar News
News January 25, 2025
ఐదు రోజుల అనంతరం ముగిసిన ఐటీ రైడ్స్
హైదరాబాద్‌లోని టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. ఇవాళ తెల్లవారుజాము వరకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గత 5 రోజుల నుంచి SVC ప్రొడక్షన్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, మ్యాంగో మీడియా ఓనర్ ఇళ్లు, కార్యాలయాలపై రైడ్స్ జరిగాయి. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ 3 రోజులపాటు సోదాలు నిర్వహించారు.
News January 25, 2025
‘మా కూతురిలా ఏ అమ్మాయి మోసపోవద్దు’
TG: తన భర్త బాజీ దొంగ అని తెలియడం, పోలీసులు ఇంటికొచ్చి అతడిని తీసుకెళ్లడంతో అవమానంతో కూతుళ్లను చంపి, ఆత్మహత్య చేసుకున్న మౌనిక తల్లిదండ్రుల ఆవేదన ఇది. కడసారి కూతురిని చూసేందుకు వారు HYD నుంచి ఖమ్మం వెళ్లారు. బాజీ మాయమాటలు చెప్పి తమ కూతురిని వలలో వేసుకున్నాడని, పెళ్లి వద్దని చెప్పినా వినలేదని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా ఎంటెక్ చదివిన మౌనిక ఆరేళ్ల కింద రైలులో పరిచయమైన బాజీని మతాంతర వివాహం చేసుకుంది.
News January 25, 2025
‘ఆపరేషన్ కగార్’ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు: హరగోపాల్
TG: ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. వెంటనే ఆ ఆపరేషన్‌ను నిలిపివేయాలన్నారు. బస్తర్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై HYDలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలను అడవుల నుంచి పంపించి, ఖనిజ సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. కాగా ఇటీవలి ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు.