News January 27, 2025
మీర్‌పేట ఘటన.. 10 గంటల పాటు రాక్షసకాండ

TG: మీర్‌పేట ఘటనలో భార్యను భర్త గురుమూర్తే చంపాడని పోలీసులు ఆధారాలు సేకరించారు. సంక్రాంతి రోజు భార్యతో గొడవ పడగా ఆమె తాళి తీసి విసిరికొట్టడంతో కోపాద్రిక్తుడైన అతను దాడి చేసి చంపేశాడు. ఆపై శరీర భాగాలన్నీ కత్తులతో నరికి బకెట్లో వేసి హీటర్‌తో ఉడికించాడు. తర్వాత వాటిని ఎండబెట్టి కాల్చి రోలులో పొడి చేసి చెరువులో పడేశాడు. పండగ రోజు ఉ.8- సా.6గంటల వరకు ఈ రాక్షసకాండ కొనసాగించినట్లు పోలీసుల సమాచారం.
Similar News
News December 4, 2025
బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు సూచనలు

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీచేయాలి. తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. ఏటా తొలకరిలో ఎండుపుల్లలను కత్తిరించి దూరంగా పారేయాలి. శిలీంధ్రాలకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కల కట్టడికి మల్చింగ్ విధానం అనుసరించాలి. కలుపు మందులు, రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ, తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
News December 4, 2025
పుతిన్ భారత పర్యటన షెడ్యూల్

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సాయంత్రం 6.35 గం.కు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు 11AMకు రాష్ట్రపతి భవన్లో స్వాగత కార్యక్రమం ఉంటుంది. 11.30AMకు మహాత్మాగాంధీ సమాధి (రాజ్‌ఘాట్) వద్ద నివాళి అర్పిస్తారు. 11.50AMకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తారు. 1.50PMకు మీడియా సమావేశం ఉంటుంది. 3.40PMకు బిజినెస్ ఈవెంట్, 7PMకు రాష్ట్రపతి ముర్ముతో సమావేశంలో పాల్గొంటారు.
News December 4, 2025
తొక్కిసలాటకు ఏడాది.. దయనీయస్థితిలో శ్రీతేజ్

గతేడాది Dec 4 రాత్రి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన <<14796361>>తొక్కిసలాటలో<<>> గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి ఏడాదైనా దయనీయంగానే ఉంది. తానంతట తాను అన్నం తినలేని స్థితిలో ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంటున్నాడు. ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నాడు. అతడికి చికిత్స ఇప్పించేందుకు నెలకు రూ.1.50 లక్షలు ఖర్చవుతున్నాయని, అల్లు అర్జున్ మేనేజర్‌ను సంప్రదిస్తే సానుకూల స్పందన లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు.


