News October 17, 2024
గ్రూప్-1 అభ్యర్థులను కలుస్తా: కేటీఆర్

TG: ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు ఆయన మద్దతు తెలిపారు. ఇవాళ HYDలోని అశోక్ నగర్ లేదా తెలంగాణ భవన్‌లో వారిని కలుస్తానని ట్వీట్ చేశారు. మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, అరెస్టు చేసిన అభ్యర్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 22, 2026
పల్నాడు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఎంతమంది రాస్తున్నారంటే?

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 49 పరీక్షా కేంద్రాల్లో 34,376 మంది విద్యార్థులు హాజరు అవుతారని డీఐఈఓ నీలావతి దేవి తెలిపారు. ఇందులో మొదటి సంవత్సంర 16,594 మంది, రెండో సం.15,628 మంది, ఒకేషనల్ మొదటి సం.1,146 మంది, రెండో సం.1,008 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2 నుంచి 10 వరకు 79 కేంద్రాల్లో, ఒకేషనల్ ప్రాక్టికల్స్ ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు 16 కేంద్రాల్లో జరుగుతాయని తెలిపారు.
News January 22, 2026
గ్రీన్‌లాండ్ స్ట్రాటజిక్ లొకేషన్.. ట్రంప్ ప్రేమకు కారణమిదే!

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్నేయడానికి ప్రధాన కారణం దాని స్ట్రాటజిక్ లొకేషన్. ఆర్కిటిక్ రీజియన్‌లో అది ఒక గేట్ వే లాంటిది. అక్కడ USకు చెందిన పిటుఫిక్ స్పేస్ బేస్ ఉంది. ఇది రష్యా కదలికలను గమనించడానికి చాలా కీలకం. అలాగే మంచు కరుగుతుండటంతో కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతాయి. ఇవి బిజినెస్‌కి ప్లస్ పాయింట్. అక్కడ భారీగా అరుదైన భూ మూలకాలు, బంగారం, ఆయిల్ నిక్షేపాలూ ఉన్నాయి.
News January 22, 2026
‘భగవంత్ కేసరి’ బిగ్ హిట్ కావాల్సింది: అనిల్

తన కెరీర్‌లో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో బాలకృష్ణతో చేసిన ‘భగవంత్ కేసరి’ ఒకటని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ‘ఈ మూవీ భారీ విజయం సాధించాల్సింది. విడుదలైన సమయంలో చంద్రబాబు జైలులో ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. సాధారణ ప్రేక్షకులు మూవీని హిట్ చేశారు. పరిస్థితులు బాగుంటే మరింతగా హిట్ అయ్యేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మూవీకి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది.


