News November 30, 2024
DEC 3న కలవండి: కాంగ్రెస్‌కు ECI ఆహ్వానం
మహారాష్ట్రలో ఓటమికి EVMలను కాంగ్రెస్ నిందిస్తుండటంపై ECI స్పందించింది. డిసెంబర్ 3న తమను కలవాలని INC బృందాన్ని ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలో అన్ని పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు భాగమవుతారని తాత్కాలిక స్పందనను తెలియజేసింది. కాంగ్రెస్ వివరించే సరైన అంశాలను సమీక్షించి, రాతపూర్వకంగా జవాబిస్తామని పేర్కొంది. పోలింగ్ శాతం అప్డేషన్ ప్రాసెస్‌లో పార్టీల భాగస్వామ్యం ఉంటుందని చెప్పింది.
Similar News
News November 30, 2024
‘పుష్ప-2’ ఒక్క టికెట్ ధర ఎంతంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా టికెట్ బుకింగ్స్ తెలంగాణలో మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. పెరిగిన ధరలతో ఒక్కో టికెట్ ధర థియేటర్లను బట్టి మారుతుంటుంది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్ రేటు రూ.531, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.354, ప్రీమియర్ షోలకు రూ.1200గా ఉండనున్నట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజులు మాత్రమే ఈ ధరలుండగా.. ఆ తర్వాత టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
News November 30, 2024
మీకు తెలుసా: క్యారమ్స్ ఎక్కడ పుట్టిందంటే…
క్యారమ్స్ గేమ్ గురించి తెలియనివారు చాలా తక్కువగా ఉంటారు. స్నేహితులు, కుటుంబీకులతో ఆడుకునేందుకు అనువైన చక్కటి టైమ్ పాస్ గేమ్ ఇది. ఈ ఆట భారత్‌లోనే పుట్టింది. 20వ శతాబ్దం మొదట్లో రాజకుటుంబాలు ఈ ఆటను ఆడేవి. 1935లో భారత్, శ్రీలంక కలిసి తొలిసారిగా క్యారమ్స్ టోర్నీ నిర్వహించాయి. ఆ తర్వాత 1988లో అంతర్జాతీయ క్యారమ్ ఫెడరేషన్ చెన్నైలో ఏర్పడింది. పటియాలా ప్యాలెస్‌లో నేటికీ అద్దపు క్యారమ్ బోర్డు ఉంది.
News November 30, 2024
డిసెంబర్ 5న కొలువుదీరనున్న MH సర్కారు?
మహారాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 5న కొలువు దీరుతుందని BJP వర్గాలు తెలిపాయి. సౌత్ ముంబైలోని ఆజాద్ మైదానంలో ‘మహాయుతి’ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని తెలిపాయి. BJP శాసనసభాపక్ష సమావేశం DEC 2 లేదా 3వ తేదీన ఉంటుందని, అప్పుడే ఆ పార్టీ LP నేతను ఎన్నుకుంటుందని చెప్పాయి. అటు శిండే స్వగ్రామంలో ఉండగా, ఫడణవీస్ సీఎం పీఠం విషయంలో ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. ఈ క్రమంలో CM ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.