News January 9, 2025
నేడు మీ టికెట్ యాప్ సేవలు ప్రారంభం

TG: సమయాన్ని వృథా చేయకుండా ఉన్న చోటు నుండే టికెట్లు బుక్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీ టికెట్ యాప్ తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ సేవలను ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. దీని ద్వారా రాష్ట్రంలోని జూ పార్క్లు, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు, ఆలయాలు, పార్కులు, క్రీడలకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతో సులభంగా ప్రవేశం పొందవచ్చని పేర్కొంది.
Similar News
News January 9, 2026
ఇంటర్ కాలేజీలకు సెలవులు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ సంక్రాంతి సెలవులను ఖరారు చేసింది. ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు స్కూళ్లకు ఈనెల 10నుంచి 16వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే APలో ఇంటర్ కాలేజీల సెలవులపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
News January 9, 2026
రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

రాజాసాబ్ మూవీ టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వ మెమోను హైకోర్టు కొట్టేసింది. దీంతో పాత రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. కాగా తెలంగాణ హోంశాఖ కార్యదర్శి అర్ధరాత్రి తర్వాత హైక్ మెమో ఇచ్చారని, తనకు ఆ అధికారం లేదని లాయర్ శ్రీనివాస్ HCకి వెళ్లారు. దీంతో ఇకపై మెమోలు జారీ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ రేట్స్ పెంచాలి అనుకుంటే జీవో 120 ప్రకారం రూ.350 మించకూడదని తేల్చిచెప్పింది.
News January 9, 2026
ట్రంప్కు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ కౌంటర్

ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేస్తున్న హెచ్చరికలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కోపిష్టి అయిన ట్రంప్ చేతులు ఇరాన్ పౌరుల రక్తంతో తడిచాయి. అతను స్వదేశంలోని సమస్యలపై ఫోకస్ చేయడం మంచిది. వేరే దేశాధ్యక్షుడి మెప్పుకోసం ఇరాన్లో నిరసనకారులు తమ వీధులను పాడు చేసుకుంటున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు.


