News December 2, 2024
విభజన అంశాలపై ముగిసిన AP, TG CSల భేటీ

విభజన అంశాలపై AP, TG సీఎస్ల కమిటీ భేటీ ముగిసింది. 3 అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. డ్రగ్స్ నివారణకు పోలీస్, ఎక్సైజ్ శాఖలతో సంయుక్త కమిటీ వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల మధ్య రూ.861 కోట్ల మేర లేబర్ సెస్ పంపిణీకి అంగీకరించారు. విద్యుత్ బకాయిలతో పాటు 9, 10 షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పులపై పంచాయితీ తేలలేదు. దీంతో మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది.
Similar News
News December 3, 2025
ములుగు: సర్పంచ్కు 286, వార్డుకు 1,109 నామినేషన్లు

జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్ మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. మొత్తం 52 సర్పంచ్ స్థానాలకు 286, 462 వార్డు స్థానాలకు 1,109 నామినేషన్లు దాఖలయ్యాయి. సయోధ్య కుదరని ఆశావాహులు చివరి రోజు వరకు వేచి చూసి నామినేషన్ వేశారు.
News December 3, 2025
సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేయాలి?

సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడానికి ఏకాదశి, పౌర్ణమి తిథులు అత్యంత శుభప్రదమైనవిగా పండితులు సూచిస్తారు. కొత్తగా ఉద్యోగం, వ్యాపారం ప్రారంభించే ముందు ఈ వ్రతం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో సుఖశాంతులు, సానుకూల శక్తి కోసం, గృహ దోషాలు తొలగిపోవడానికి ఈ వ్రతం చేస్తారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభ దినాలలో చేస్తే విశేష ఫలితాలుంటాయని నమ్మకం. ఈ వ్రతం గురించి మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 3, 2025
సత్యనారాయణస్వామి వ్రతం: ఏయే పూజలుంటాయి?

సత్యనారాయణస్వామి వ్రతంలో మొదటగా విఘ్నాలను తొలగించే వినాయకుడికి తొలి పూజలు చేస్తారు. ఆ తర్వాత కలశారాధన, పంచలోక పాలక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన దైవమైన సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజలు, పంచామృత స్నానాలు, అష్టోత్తర శతనామ పూజలు సమర్పిస్తారు. చివరగా వ్రత కథను చదివి, హారతి ఇచ్చి, ప్రసాదం పంపిణీ చేయడంతో వ్రతం పూర్తవుతుంది.


