News February 5, 2025
దానం నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ!

TG: అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశం, అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకు సమాధానం ఇవ్వడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 26, 2025
కృష్ణా తీరంలో వేదాంత ఆన్షోర్ బావులకు అనుమతి

AP: కృష్ణా జిల్లాలో ఆయిల్ & గ్యాస్ నిక్షేపాల వెలికితీత కోసం 20 ఆన్షోర్ బావుల తవ్వకానికి ప్రభుత్వం వేదాంత కంపెనీకి NOC జారీచేసింది. తవ్వకాలు జరిపే బ్లాకులో కెనాల్ ఉండడంతో ఇరిగేషన్ దృష్ట్యా అనుమతి టెంపరరీ అని పేర్కొంది. బందర్, KDS కెనాల్స్, డ్రైనేజీ నెట్వర్క్, రిజర్వాయర్లు, చెరువుల నుంచి నీళ్లు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కాగా ఈ బ్లాకులో 35 ప్రాంతాల్లో తవ్వకాలకు వేదాంత NOC అడిగింది.
News December 26, 2025
వేరుశనగలో ఈ అంతర పంటలతో మేలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.
News December 26, 2025
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి: కిషన్ రెడ్డి

TG: డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పదేళ్లలో 2 ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల కోట్లు అప్పు చేశాయని ఆదిలాబాద్లో జరిగిన సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆరోపించారు. దోచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి KCR కుటుంబం రోడ్డెక్కిందన్నారు. రేవంత్ పాలనలో రాష్ట్రం మరింత ఆగమైందని విమర్శించారు.


