News August 27, 2024
మెగా-అల్లు వివాదం.. మరోసారి స్పందించిన జనసేన ఎమ్మెల్యే

అల్లుఅర్జున్‌పై తాను చేసిన <<13952824>>వ్యాఖ్యలు<<>> పూర్తిగా వ్యక్తిగతం అని జనసేన MLA శ్రీనివాస్ తెలిపారు. ఒక మెగా అభిమానిగా మాత్రమే స్పందించానని అన్నారు. ‘నాకు ఇష్టమైతే నేను వస్తా. చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్‌ను ఎవరైనా గౌరవం లేకుండా మాట్లాడితే స్పందిస్తా’ అని ట్వీట్ చేశారు. ‘హీరోలను YCP టార్గెట్ చేసిందన్న JSP నేతలే ఇప్పుడు AAను టార్గెట్ చేస్తున్నారు’ అని వస్తున్న విమర్శలపై MLA స్పందించారు.
Similar News
News December 23, 2025
నాడు ఊరిలో సఫాయీ.. నేడు ఊరికే సర్పంచ్

TG: నిర్మల్ జిల్లా తానూర్ మండలం తొండాలకి చెందిన మిరేకర్ మాధవ్ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. 19 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆయన పోటీ చేసి గెలుపొందారు. నిన్న మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సఫాయీ కార్మికుడిగా ఉన్న తనను సర్పంచ్ చేసిన గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు.
News December 23, 2025
జుట్టు ఆరోగ్యం కోసం ఏం తినాలంటే?

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని సంరక్షించడంతో పాటు పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. దీనికోసం బాదం, చిలగడదుంప, గుడ్డు, శనగలు, పాలకూర తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఉండే బయోటిన్, ఐరన్, ఫోలేట్, విటమిన్ C ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. జుట్టు రాలిపోతున్నా, పలచగా ఉన్నా ఈ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News December 23, 2025
APPLY NOW: NIT గోవాలో పోస్టులు

<


