News August 28, 2025
మెగా డీఎస్సీ.. నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

AP: డీఎస్సీ అభ్యర్థులకు ఇవాళ ఉ.9 గంటల నుంచి <<17519055>>సర్టిఫికెట్<<>> వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. కాల్ లెటర్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యర్థులు సర్టిఫికెట్లను సైట్‌లో అప్‌లోడ్ చేసి, తమకు కేటాయించిన తేదీ, సమయం, వేదికలో CVకి హాజరుకావాలని సూచించారు. వెరిఫికేషన్ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. హాజరు కాని, అర్హత లేని వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News August 28, 2025
సరిహద్దుల్లో కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్ సెక్టార్‌లో LoC గుండా చొరబాటుకు యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. కొంతమంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నారని తెలుసుకున్న సైన్యం వెంటనే అప్రమత్తమైంది. J&K పోలీసులతో కలిసి ‘నౌషేరా నార్-4’ పేరిట జాయింట్ ఆపరేషన్ చేపట్టి ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేసింది. మిగిలిన వారి కోసం పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు ఆర్మీ ట్వీట్ చేసింది.
News August 28, 2025
భారత్‌తో వైరం.. ట్రంప్‌పై హౌస్ డెమోక్రాట్స్ ఫైర్

భారత్‌పై ట్రంప్ టారిఫ్స్ విధించడాన్ని అమెరికన్లు సైతం తప్పుపడుతున్నారు. తాజాగా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ డెమోక్రాట్స్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ‘రష్యా నుంచి భారీగా ఆయిల్ కొంటున్న చైనా తదితర దేశాలపై టారిఫ్స్ వేయకుండా ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. US-భారత్ సంబంధాలను దెబ్బతీస్తున్నారు. అమెరికన్స్‌కు నష్టం జరుగుతోంది. ఇది ఉక్రెయిన్ కోసం చేస్తున్నట్లు అనిపించట్లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News August 28, 2025
మరో 6 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

TGలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 6 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నల్గొండ, యాదాద్రి, KNR, ఖమ్మం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. <<17538468>>ఇప్పటికే<<>> కామారెడ్డి, MDK, నిర్మల్, ADB, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది.