News September 10, 2025

ఈ నెల 15న మెగా డీఎస్సీ తుది జాబితా?

image

AP: 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే 19న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ సభలోనే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్త టీచర్లకు దసరా సెలవుల్లో ట్రైనింగ్, కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తారని, సెలవుల అనంతరం స్కూళ్లు పున ప్రారంభం రోజున వారంతా విధుల్లో చేరతారని సమాచారం.

Similar News

News March 18, 2026

రెనాల్ట్ డస్టర్ మళ్లీ వచ్చేసింది!

image

ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ కంపెనీ 4ఏళ్ల తర్వాత మిడ్ రేంజ్ SUVతో మళ్లీ IND మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఆల్ న్యూ డస్టర్’ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో రాగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రారంభ ధర రూ.10.49లక్షలుగా ఉంది. ఇది గ్రాండ్ విటారా, క్రెటా, టాటా సియెర్రాకు పోటీ ఇవ్వనుంది. ఇక ఇదే మోడల్‌లో హైబ్రిడ్ వెర్షన్‌ 1.8L ఇంజిన్, 1.4 KWH బ్యాటరీతో త్వరలో లాంచ్ కానుంది.

News March 18, 2026

‘హంట్’ మొదలుపెట్టిన రష్మిక!

image

వివాహ వేడుకలు పూర్తి చేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్న తన తర్వాతి చిత్రం ‘మైసా’పై ఫోకస్ పెట్టారు. ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన విషయాన్ని తెలియజేస్తూ ‘ది హంట్ బిగిన్స్’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. గిరిజన తెగకు చెందిన మహిళగా ‘మైసా’లో రష్మిక కనిపించనున్నారు. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రావు రమేశ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

News March 18, 2026

పంట మార్పిడి వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

image

రైతులు ఏళ్లుగా అనుసరిస్తున్న ఏకపంట సాగును మానుకొని పంట మార్పిడిపై దృష్టిపెట్టాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల భూ భౌతిక, రసాయన మార్పులను నియంత్రించడమే కాకుండా, భూసారం, భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. చీడపీడల ఉద్ధృతితో పాటు రసాయనాల వినియోగం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి పెరుగుతుంది.