News June 13, 2024
మెగా డీఎస్సీ: ఎందులో ఎన్ని పోస్టులంటే?

AP: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ – 7,725, ఎస్జీటీ – 6,371, టీజీటీ – 1,781, పీజీటీ – 286, ప్రిన్సిపల్స్ – 52, పీఈటీ – 132 పోస్టులు ఉన్నాయి.
> SHARE
Similar News
News January 30, 2026
రూ.లక్ష జీతంతో ఐఐటీ ఢిల్లీలో ఉద్యోగాలు

<
News January 30, 2026
విష్ణువు వరాహ అవతారాన్ని ఎందుకు ఎత్తాడు?

హిరణ్యాక్షుడు వేదాలను అపహరించి, భూమిని సముద్ర గర్భంలో దాచాడు. దీంతో సృష్టి కార్యానికి ఆటంకం కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుని నాసిక నుంచి అతి చిన్న రూపంలో వరాహ స్వామి ఉద్భవించాడు. క్షణ కాలంలోనే ప్రచండ రూపం దాల్చాడు. లోకోద్ధరణ కోసం సముద్రంలోకి దూకి, హిరణ్యాక్షుడిని సంహరించి, కోరలపై భూమిని నిలిపి పైకి తెచ్చాడు. వేదాలను రక్షించి, భూమిని ఉద్ధరించడమే ఈ అవతార ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత తిరుమలలో కొలువయ్యారు.
News January 30, 2026
టమాటలో పచ్చదోమ, తామర, సూది పురుగుల నివారణ

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల టమాటలో పచ్చదోమ, తామర పురుగు, సూది పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంది. పచ్చదోమ నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2ML లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల నివారణకు లీటరు నీటికి డైమిథోయెట్ 2ML లేదా మిథైల్ డెమటాన్ 2ML కలిపి పిచికారీ చేయాలి. సూది పురుగు నివారణకు లీటరు నీటికి నోవాల్యురాన్ 1.5ML లేదా ఫ్లూబెండమైడ్ 0.25ML పిచికారీ చేయాలి.


