News October 24, 2024

నవంబర్ మొదటి వారంలో మెగా డీఎస్సీ?

image

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఎటువంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు, నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తోంది. 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.

Similar News

News October 24, 2024

‘టార్జాన్’ నటుడు కన్నుమూత

image

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ(86) కన్నుమూశారు. 1960లో కండలు తిరిగిన ‘టార్జాన్’గా ఆయన నటించారు. ఈ సినిమాతో ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తను కుమార్తె కిర్‌స్టెన్ సోషల్ మీడియా ద్వారా తాజాగా ధ్రువీకరించారు. ఈ ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని, తాను తండ్రిని కోల్పోయినట్లు ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన 2001లో నటనకు స్వస్తిపలికి రచయితగా మారారు.

News October 24, 2024

నమ్ముకున్న పార్టీయే నన్ను అవమానిస్తోంది: జీవన్‌రెడ్డి

image

TG: నమ్ముకున్న పార్టీయే తనను అవమానిస్తోందంటూ AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ MLC జీవన్‌రెడ్డి లేఖ రాశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై పార్టీనే మార్గదర్శకం చేయాలన్నారు. కాంగ్రెస్ కూడా కేసీఆర్‌లా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

News October 24, 2024

రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తాం: బండి

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇళ్ల కూల్చివేతలకు తాము వ్యతిరేకమన్నారు. మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్ అని బండి ఆరోపించారు. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని ప్రభుత్వానికి మూసీ కోసం రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడివని నిలదీశారు.