News April 8, 2025
మెగా DSC.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

AP: విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. DSC, టెన్త్, ఇంటర్ ఫలితాలతో పాటు పలు అంశాలపై సమీక్షించారు. రాబోయే 4ఏళ్లు విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాలన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా వీలైనంత త్వరగా DSC ప్రకటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెన్త్, ఇంటర్ ఫలితాల ప్రకటన విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 17, 2025
సిట్ విచారణకు విజయసాయి గైర్హాజరు

AP: మద్యం కుంభకోణం కేసులో ఇవాళ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని సిట్‌కు సమాచారం ఇచ్చారు. ఎప్పుడు విచారణకు హాజరయ్యేది త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.
News April 17, 2025
వరుసగా మూడ్రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు రేపు సెలవు ఉండనుంది. గుడ్‌ఫ్రైడేని పురస్కరించుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రేపు జనరల్ హాలిడేగా ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులూ పనిచేయవు. పలు కేంద్ర సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు శనివారమూ సెలవు ఉండటంతో ఆదివారంతో కలిపి మొత్తం 3 రోజులు సెలవులు రానున్నాయి. మీకూ వరుస సెలవులు వచ్చాయా? కామెంట్ చేయండి.
News April 17, 2025
రోజూ ఆకుకూరలు తింటే ఇన్ని లాభాలా?

రోజూ ఆకుకూరలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ‘పాలకూరతో గుండెపోటు రిస్కు తగ్గుతుంది. కొత్తిమీర కొలస్ట్రాల్ లెవెల్స్‌ను 10-15% తగ్గిస్తుంది. మెంతిలో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించి బ్రెస్ట్ & ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్కును తప్పిస్తుంది. గోంగూర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూర బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నిరోధిస్తుంది’ అని తెలిపారు.