News March 25, 2025

ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: చంద్రబాబు

image

AP: ఏప్రిల్ మొదటివారంలో DSC నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తాం. 2027నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్‌తో అమరావతిని అభివృద్ధి చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 28, 2025

ALERT.. వాకింగ్‌లో ఇలా చేయకండి

image

ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్(నడక) చేయడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్ని తప్పులు చేస్తే గుండెపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ కింది తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు.
* మరీ వేగంగా నడవడం
* వార్మప్ చేయకపోవడం
* వంగి నడవడం
* వాకింగ్ ముందు/తర్వాత నీరు తాగకపోవడం
* అమితంగా తినడం
* కాలుష్య ప్రాంతాల్లో నడవడం
* అతిగా శ్రమించడం

News March 28, 2025

IPL: పాపం కావ్య

image

సీజన్ తొలి మ్యాచ్‌లో 286 రన్స్ చేసి భారీగా అంచనాలు పెంచేసిన SRH రెండో గేమ్‌లో చతికిలపడింది. LSG చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో అభిమానులతో పాటు ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ డీలా పడిపోయారు. నిన్న స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఆమె పలికించిన హావభావాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పాపం కావ్య పాప’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News March 28, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ పబ్లిక్ టాక్

image

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ థియేటర్లలో విడుదలైంది. సినిమాలో డైలాగ్స్, కామెడీ బాగున్నాయని, లడ్డూ క్యారెక్టర్ విపరీతంగా నవ్విస్తుందని మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు. యూత్ ఆడియన్స్‌కు నచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని, స్పెషల్ సాంగ్ బాగుందని అంటున్నారు. అక్కడక్కడ సాగదీతగా, బోరింగ్ ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ

error: Content is protected !!