News September 20, 2025
24 లేదా 25 తేదీల్లో మెగా DSC నియామక పత్రాల ప్రదానం

AP: రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 24 లేదా 25వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 19న నియామక ఉత్తర్వుల అందజేతకు నిర్ణయించినా వర్షాల కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా అధికారిక షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
Similar News
News September 21, 2025
నేటి ముఖ్యాంశాలు

* H1B వీసా ఫీజును రూ.88 లక్షలకు పెంచుతూ ట్రంప్ ఉత్తర్వులు
* ట్రంప్ నిర్ణయం ఇరుదేశాలకూ ఇబ్బందికరమన్న భారత్
* ట్రంప్ H1B వీసా నిబంధనలు మోదీ వైఫల్యం: కాంగ్రెస్
* విదేశాలపై ఆధారపడటమే అతిపెద్ద శత్రువు: PM మోదీ
* చెత్తతో పాటు రాజకీయాలనూ క్లీన్ చేస్తా: CM CBN
* మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్
* ట్రంప్ నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: మంత్రి శ్రీధర్ బాబు
News September 21, 2025
H1B వీసా సమస్యను వెంటనే పరిష్కరించాలి: CM రేవంత్

TG: H1B వీసాపై ట్రంప్ ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక ఇండో-అమెరికన్ సత్సంబంధాల్లో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదన్నారు. దీని వల్ల తెలుగు టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కోరుతూ రేవంత్ ట్వీట్ చేశారు.
News September 20, 2025
కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్

AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం.. ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తా’ అని ట్వీట్ చేశారు.