News October 31, 2024

టీజర్ రాకపోయేసరికి.. మెగా ఫ్యాన్స్ నిరాశ

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’ మేకర్స్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈరోజు మ.12.06గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ఉదయం చెప్పి తీరా సమయానికి ఇంకాస్త సమయం కావాలని ట్వీట్ చేశారు. దీంతో నిరాశకు గురైన కొందరు ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ కాదు ‘డేట్ ఛేంజర్’ అని సెటైర్లు వేస్తున్నారు. లేటైనా ఫర్వాలేదు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు.

Similar News

News February 17, 2026

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

TG: CM రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ఈనెల 23న జరగనుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల నిర్వహణపై దీనిలో చర్చించనున్నారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కాగా CM రేవంత్ ఇవాళ ముంబైకి వెళ్తున్నారు. MH CM ఆహ్వానం మేరకు అక్కడ జరిగే ‘క్లైమెట్ వీక్’లో పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలపై ప్రసంగించనున్నారు.

News February 17, 2026

సూపర్-8లో భారత్ ప్రత్యర్థులు వీరే..

image

T20WC-2026లో సూపర్-8 జట్లు దాదాపుగా ఖరారయ్యాయి. రేపు నమీబియాపై గెలిస్తే <<19168498>>పాక్ సూపర్-8కు<<>> వెళ్తుంది.
సూపర్-8 గ్రూప్-1లో వెస్టిండీస్, భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్/USA, న్యూజిలాండ్ ఉంటాయి. భారత్ ఫిబ్రవరి 22న సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌లో), 26న జింబాబ్వే (చెన్నైలో), మార్చి 1న వెస్టిండీస్‌ (కోల్‌కతాలో)తో తలపడనుంది.

News February 17, 2026

పాకిస్థాన్ సూపర్-8కు వెళ్లాలంటే?

image

T20WC-2026: సూపర్-8 చేరేందుకు పాకిస్థాన్ రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. నమీబియాపై గెలిస్తే 6 పాయింట్లతో నేరుగా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వర్షంతో రద్దయినా 5 పాయింట్లతో వెళ్తుంది. నమీబియాతో ఓడిపోతే మాత్రం పాకిస్థాన్ ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు USA సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఇక USAతో (+0.788)పోలిస్తే పాకిస్థాన్ (-0.403) నెట్ రన్‌రేట్ తక్కువగా ఉంది.