News October 9, 2025
హిందూపురంలో మెగా జాబ్ మేళా

AP: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 10న హిందూపురంలోని SDGC ఎంబీఏ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీడాప్, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తారు. 15 మల్టీ నేషనల్ కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. టెన్త్ నుంచి పీజీ వరకు చదువుకున్నవారు ముందుగా https://naipunyam.ap.gov.in/ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Similar News
News October 9, 2025
7,267 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS) 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రిన్సిపల్, PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. ఉద్యోగాలను బట్టి పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమా పాసైన వారు అర్హులు. అప్లైకి చివరి తేదీ OCT 23. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్:
https://nests.tribal.gov.in
News October 9, 2025
ఐపీఎస్‌ను బలి తీసుకున్న కుల వివక్ష!

కులవివక్ష రాజకీయాల్లోనే కాదు అధికారులనూ పట్టిపీడిస్తోందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. సీనియర్ అధికారులు వేధిస్తున్నారని తెలుగువాడైన హరియాణా ADGP పూరన్ కుమార్ 8 పేజీల లేఖ రాసి ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసు శాఖలో కులవివక్షతో పాటు అక్రమాలపై గళమెత్తడంతో ఉన్నతాధికారులు తనను నాశనం చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. లంచం కేసులోనూ ఇరికించారని తుపాకీతో కాల్చుకున్నారు. ఆయన భార్య అమనీత్ IAS.
News October 9, 2025
20 మంది పిల్లలు మృతి.. సర్కార్ నిర్లక్ష్యమే కారణమా?

కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మంది పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19నే మరణాలు నమోదైనా సర్కార్ నిర్లక్ష్యం వహించింది. 29న సిరప్ శాంపిళ్లను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఛింద్వాడా నుంచి భోపాల్ (300 కి.మీ)కు పంపారు. గంటల్లో వెళ్లాల్సిన శాంపిల్స్ 3 రోజులకు అక్కడికి చేరాయి. రిపోర్ట్ రాకముందే అక్టోబర్ 1, 3 తేదీల్లో ఆ సిరప్ సేఫ్ అని ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించడం గమనార్హం.