News October 24, 2025

ఈ నెల 29న మెగా జాబ్‌మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు(D) నరసరావుపేటలోని ఈశ్వర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, ఫార్మసీ, డిగ్రీ, ఇంజినీరింగ్, MBBS, PG అర్హతగల అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 – 35ఏళ్ల మధ్య ఉండాలి. ఈ జాబ్‌మేళాలో 34 MNC కంపెనీలు పాల్గొంటున్నాయి. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/

Similar News

News February 9, 2026

ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

image

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.

News February 9, 2026

దీపారాధనలో ఏ నూనె వాడాలంటే?

image

దీపారాధనలో మనం వాడే నూనెను బట్టి ఆయా దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. మహాలక్ష్మికి ఆవు నెయ్యి అత్యంత ప్రీతికరమైనది. దీనివల్ల ఐశ్వర్యం, సాత్విక గుణం పెరుగుతాయి. విష్ణుమూర్తికి, శని దేవునికి, సుబ్రహ్మణ్య స్వామికి నువ్వుల నూనె ప్రీతికరం. గణపతికి కొబ్బరి నూనె ఇష్టమైనది. అమ్మవార్లకు ఆముదం/వేప నూనె ఉపయోగిస్తారు. శనగ నూనెను దీపారాధనకు అస్సలు వాడకూడదు. తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.

News February 9, 2026

కోహ్లీVsగంభీర్ ప్రచారంపై BCCI సెక్రటరీ ఏమన్నారంటే?

image

విరాట్ కోహ్లీ-కోచ్ గంభీర్ మధ్య గొడవలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీసీసీఐ కార్యదర్శి సైకియా ఖండించారు. వారిద్దరికి ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. వారిద్దరి మధ్య మంచి సంబంధం ఉందని చెప్పారు. టెస్టులకు రిటైర్మెంట్ విషయంలో కోహ్లీని ఎవరూ బలవంతం చేయలేదని తెలిపారు. ఆయనొక లెజెండ్ అని, సొంత నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఆటగాళ్ల కెరీర్‌ విషయంలోనూ BCCI జోక్యం చేసుకోదని సైకియా తెలిపారు.