News July 10, 2025
నేడు మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0

AP: ప్రభుత్వం మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజు 2 కోట్ల మందితో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనుంది. 74,96,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్స్, 1,49,92,456 మంది పేరెంట్స్, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. మొత్తం 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పుట్టపర్తి కొత్తచెరువు ZP స్కూల్లో కార్యక్రమానికి CM చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు.
Similar News
News July 10, 2025
అక్టోబర్ 31న బాహుబలి రీరిలీజ్

‘బాహుబలి’ సినిమాను అక్టోబర్ 31న రీరిలీజ్ చేయనున్నట్లు డైరెక్టర్ రాజమౌళి ప్రకటించారు. ఆ మూవీ విడుదలై నేటికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ‘బాహుబలి-1’, ‘బాహుబలి-2’లను కలిపి ‘బాహుబలి ఎపిక్’ పేరుతో ఒకేసారి రిలీజ్ చేస్తామని జక్కన్న ట్వీట్ చేశారు. నిడివి ఎక్కువ కాకుండా ఆ రెండు సినిమాల్లోని ముఖ్యమైన సన్నివేశాలతో రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
News July 10, 2025
మంత్రి లోకేశ్‌ను అభినందించిన సీఎం

AP: మంత్రి లోకేశ్ విద్యాశాఖను అద్భుతంగా నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆయన ఏరికోరి ఆ శాఖను ఎంచుకున్నారని తెలిపారు. ‘మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రం పాఠశాల. చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతోకొంత సాయం చేయాలి. ఆడ, మగ బిడ్డలను సమానంగా చూసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే మేం ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నాం’ అని సత్యసాయి జిల్లాలో తెలిపారు.
News July 10, 2025
తెలంగాణలో వర్షాలు

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అటు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 16 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మీ ప్రాంతాల్లో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.