News December 4, 2024
ఈ నెల 7న మెగా పేరెంట్-టీచర్ మీట్

AP: ఈ నెల 7న ఉ.9 గంటల నుంచి మ.1 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో మెగా పేరెంట్-టీచర్ మీట్‌ను నిర్వహించనుంది. విద్యార్థులు, స్కూళ్ల అభివృద్ధిపై టీచర్లు, తల్లిదండ్రులు చర్చించనున్నారు. తల్లులకు రంగోలి పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి వినోదాత్మక కార్యక్రమాలు ఉంటాయి. సీఎం CBN, మంత్రి లోకేశ్ బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Similar News
News January 28, 2026
మేడారానికి భారీగా వైద్య సిబ్బంది

TG: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. మేడారంలో 50 పడకల ఆస్పత్రి, జాతర ప్రాంగణంలో 30 మెడికల్ క్యాంపులు, రూట్లలో 42 క్యాంపులు ఏర్పాటు చేశారు. 544మంది డాక్టర్లు సహా 3,199మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 38 పెద్ద అంబులెన్సులు, ట్రాఫిక్ జామ్ అయితే పేషెంట్ వద్దకే వెళ్లేలా 40 బైక్ అంబులెన్సులను సిద్ధం చేశారు.
News January 28, 2026
‘కారుణ్య నియామకాల్లో మానవత్వమే ప్రధానం’

AP: ఉద్యోగి మరణం లేదా అనారోగ్య కారణాలతో పదవీ విరమణ ఆ కుటుంబానికి ఆర్థిక మరణంగా మారకూడదని HC స్పష్టం చేసింది. కారుణ్య నియామకాలను సాంకేతిక కారణాలతో ఏకపక్షంగా తిరస్కరించొద్దని సూచించింది. విజయనగరం జిల్లాకు చెందిన నారాయణమ్మ కేసులో ఐదేళ్ల గడువు పేరుతో ఉద్యోగం నిరాకరించడం తప్పేనని పేర్కొంది. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మానవీయ కోణంలో చూడాలని, 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించింది.
News January 28, 2026
పంటలకు పురుగుల బెడద.. నివారణ ఎలా?

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రధాన పంటలకు చీడపీడల బెడద పెరిగింది. మామిడిలో తేనెమంచు పురుగు, వరిలో కాండం తొలిచే పురుగు, మిరపలో తామర పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగుల ఉద్ధృతి పెరిగింది. జీడిమామిడిలో టీ దోమ, మినుములో కాండం ఈగ సమస్య ఎక్కువైంది. వీటిని సకాలంలో కట్టడి చేయకుంటే ఈ పంటలకు తీవ్ర నష్టం తప్పదు. ఈ పురుగులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.


