News April 2, 2024

రిషి సునాక్‌కు మెగా పోల్ షాక్

image

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు సివిల్ సొసైటీ ప్రచార సంస్థ మెగా పోల్ షాక్ ఇచ్చింది. అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేసింది. 15,029మందిపై ఈ పోల్‌ను నిర్వహించారు. అధికార పార్టీతో పోలిస్తే ప్రతిపక్ష లేబర్ పార్టీ 19పాయింట్ల ఆధిక్యంలో ఉందని, 286 సీట్ల మెజారిటీ సాధిస్తుందని జోస్యం చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 250 చోట్ల అధికార పార్టీ ఓడిపోతుందని తెలిపింది.

Similar News

News January 21, 2026

మొబైల్ లేకున్నా వాట్సాప్‌ వాయిస్, వీడియో కాల్స్!

image

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది. దీంతో మొబైల్ లేకపోయినా వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. గ్రూప్ కాల్‌లో 32 మంది మాత్రమే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో ఏ అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే కాల్స్‌లో కనెక్ట్ కావచ్చు. వాట్సాప్‌ వెబ్ యూజర్లకు 2 వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

News January 21, 2026

ICC నం.1 బ్యాటర్‌గా మిచెల్

image

టీమ్ ఇండియాతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇది వరకు టాప్ ప్లేస్‌లో ఉన్న విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయారు. అఫ్గానిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను వెనక్కినెట్టి 3వ స్థానానికి చేరుకున్నారు. కాగా భారత్‌తో వన్డే సిరీస్‌లో మిచెల్ రెండు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.

News January 21, 2026

రైలును పట్టాలు తప్పించే కుట్ర!

image

మహారాజా ఎక్స్‌ప్రెస్‌‌కు పెను ముప్పు తప్పింది. రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు కుట్ర చేశారు. పట్టాలపై ఇనుప కడ్డీలను పెట్టారు. లోకో పైలట్ వెంటనే గుర్తించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. నిన్న రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో రైలులో పెద్ద సంఖ్యలో విదేశీ టూరిస్టులు ఉన్నారు. ఇనుప కడ్డీలను తొలగించి, డాగ్ స్క్వాడ్, పోలీసుల తనిఖీల తర్వాత రైలును పంపారు.