News February 7, 2025
‘లైలా’ ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’ సినిమా ఈనెల 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. ఇప్పటికే విశ్వక్‌తో పాటు ‘లైలా’ నిర్మాత చిరును కలిసి వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్ పంచుకున్నారు.
Similar News
News February 7, 2025
RTC జేఏసీని చర్చలకు పిలిచిన కార్మిక శాఖ
TGSRTC జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా ఈ నెల 10న చర్చల్లో పాల్గొనాలని పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో జేఏసీ డిమాండ్ చేసింది.
News February 7, 2025
ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ లేదు: సీఎం
TG: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని CM రేవంత్ వెల్లడించారు. ‘క్యాబినెట్‌లో ఎవరుండాలనే దానిపై అధిష్ఠానానిదే నిర్ణయం. నేను ఎవరి పేరు ప్రతిపాదించలేదు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తాం. త్వరగా అరెస్ట్ చేయించి జైలుకు పంపే ఆలోచన లేదు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే లక్ష్యం. పనిచేసుకుంటూ పోవడమే తెలుసు. వ్యక్తిగత నిర్ణయాలు ఎన్నడూ ఉండవు’ అని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు.
News February 7, 2025
ప్రధాని మోదీని కలిసిన హీరో నాగార్జున
ప్రధాని మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు.