News December 1, 2024
మెగాస్టార్ చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల మూవీ లాక్?

మెగాస్టార్ చిరంజీవితో ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల, నేచురల్ స్టార్ నానీతో ‘ది పారడైజ్’ సినిమా తెరకెక్కిస్తుండగా.. ఇది పూర్తికాగానే చిరు సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలిపాయి. కాగా, చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Similar News
News February 1, 2026
ఫోన్ ట్యాపింగ్‌పై కఠినంగా వ్యవహరించాలి: కిషన్ రెడ్డి

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను రెండేళ్లుగా సీరియల్ కింద సాగదీస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘జడ్జీలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులు కోర్టులో చెప్పారు. తన భర్త ఫోనూ ట్యాప్ చేశారని కవిత అన్నారు. ఈ కేసుపై కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వంలో మంత్రులు, కేసీఆర్ కుటుంబంలో సభ్యులు తమ వాటాల కోసం కొట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
News February 1, 2026
బడ్జెట్‌పై భౌగోళిక రాజకీయాల ఎఫెక్ట్!

ఈసారి బడ్జెట్‌పై జియోపాలిటిక్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రేర్ ఎర్త్ మెటల్స్‌పై చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం రేర్ ఎర్త్ కారిడార్ ప్రకటించింది. అణువిద్యుత్‌కు సంబంధించిన బేసిక్ కస్టమ్స్ డ్యూటీపై 2035 వరకు మినహాయింపు, సెమీకండక్టర్ మిషన్ 2.0 లాంచ్ విదేశాలపై ఆధారపడటం తగ్గించేందుకు తీసుకున్న చర్యలుగా తెలుస్తోంది. రక్షణ పటిష్ఠం చేసేందుకు డిఫెన్స్‌లోనూ భారీగా నిధులు కేటాయించింది.
News February 1, 2026
4 గంటలు.. అటు కేసీఆర్ విచారణ.. ఇటు ఆందోళనలు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు 4 గంటలుగా విచారిస్తున్నారు. మధ్యాహ్నం 3 నుంచి ప్రారంభమైన విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రశ్నలకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. విచారణ మొత్తం ఆడియో, వీడియో రూపంలో చిత్రీకరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి.


