News March 23, 2024

మెగాస్టార్ ఆఫర్లు తిరస్కరించా: పృథ్వీరాజ్

image

‘సలార్’లో వరదరాజ మన్నార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన పృథ్వీరాజ్ సుకుమారన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. HYD వచ్చిన ఆయన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. సైరా నరసింహారెడ్డిలో నటించాలని, గాడ్ ఫాదర్‌కి దర్శకత్వం వహించాలని మెగాస్టార్ తనను కోరారని చెప్పారు. ఆ రెండుసార్లు తాను ‘ఆడుజీవితం’లో బిజీగా ఉండటంతో చిరంజీవికి క్షమాపణ చెప్పినట్లు వెల్లడించారు.

Similar News

News October 28, 2025

లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

image

TG: మల్లోజుల, ఆశన్న బాటలోనే మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు. 45 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఇవాళ DGP శివధర్ రెడ్డి ఎదుట సరెండర్ అయ్యారు. మంచిర్యాల(D) మందమర్రికి చెందిన ఆయన సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ 1980లో పీపుల్స్‌ వార్‌ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. 1984లో AITUC నేత అబ్రహం హత్య కేసులో అరెస్టై ADB సబ్ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు.

News October 28, 2025

తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా: YCP

image

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించట్లేదని YCP ఆరోపిస్తోంది. ‘మంత్రి కందుల దుర్గేశ్ నియోజకవర్గంలోనే పునరావాస కేంద్రాలు కనిపించట్లేదు. కలెక్టర్ ఆదేశాలిచ్చినా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా? విజయనగరం జిల్లా గుర్లలో తుఫానుతో వరి పంట నేలకొరిగింది. రైతుల్ని పరామర్శించడం కాదు కదా.. కనీసం కూటమి నేతలు పట్టించుకోవట్లేదు’ అని ట్వీట్ చేసింది.

News October 28, 2025

వరదల సమయం.. పాడి పశువుల సంరక్షణకు సూచనలు

image

భారీ తుఫానులు, వరదలు సంభవించినప్పుడు రైతులు తమ ప్రాణాలను, ఆస్తులను కాపాడుకునే ప్రయత్నంలో, పశువులను అలాగే కట్టేసి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతారు. అవి వరద నీరు వల్ల ఎటూ వెళ్లలేని స్థితిలో ప్రాణాలు కోల్పోతాయి. అందుకే వరదల సమయంలో పశువులను పాకల్లో కట్టకుండా వదిలేయాలి. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా పశువులను ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వాటికి కొంత మేతను అందించాలి.