News April 2, 2025
‘విశ్వంభర’ కోసం సింగర్గా మారిన మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈక్రమంలో అంచనాలు మరింత పెంచేందుకు మెగా గాత్రాన్ని వాడుకునేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సినిమాలో ఓ పాట పాడేందుకు చిరు ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అప్డేట్ రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Similar News
News November 25, 2025
కుడి ఎడమైతే.. మెదడుకు మంచిదే

ప్రతిరోజూ కుడి చేతితో చేసే పనులను ఎడమ చేత్తో చేస్తే మెదడు చురుగ్గా మారుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ స్టడీలో వెల్లడైంది. కుడి చేతితో చేసే పనికి ఎడమ చేతిని ఉపయోగిస్తే మెదడు చురుకుదనం, ఏకాగ్రత, మెమొరీ పెరుగుతాయి. రెగ్యులర్గా కుడి చేతితో చేసే బ్రషింగ్కు ఎడమ చేతిని ఉపయోగించండి. ఇలా చేస్తే చిన్న చిన్న సవాళ్లను ఇష్టపడే మెదడులో కొత్త నాడీ సంబంధాలు ఏర్పడతాయి. దీనినే న్యూరో ప్లాస్టిసిటీ అంటారు.
News November 25, 2025
అతి సన్నని వరి వంగడం త్వరలో విడుదల

సన్న వరి రకాలకు డిమాండ్ దృష్ట్యా, అత్యంత నాణ్యత గల అతి సన్నని వరి వంగడం ‘MTU 1426’ను మార్టేరు వరి పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. ఇది రబీకి అనుకూలం. పంటకాలం 125 రోజులు. కాండం దృఢంగా ఉండి, చేనుపై పడిపోదు. దిగుబడి హెక్టారుకు 6.5- 7 టన్నులు. ఇది తొలి ఏడాది చిరు సంచుల ప్రదర్శనలో మంచి ఫలితాలనిచ్చింది. మరో 2 ఏళ్లు పరిశీలించి ఫలితాల ఆధారంగా విడుదల చేస్తారు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 25, 2025
విషతుల్యమవుతున్న తల్లిపాలు

తల్లిపాలు స్వచ్ఛమైనవి, కల్తీలేనివని మనం అనుకుంటాం. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తల్లి పాలల్లో మైక్రోప్లాస్టిక్ అవశేషాలున్నట్లు గతంలో పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే తాజాగా బిహార్లో చేసిన ఓ పరిశోధనలో తల్లిపాలలో యురేనియం అవశేషాలున్నట్లు గుర్తించారు. ఇవన్నీ ఇలాగే కొనసాగితే మానవ మనుగడే కష్టం అంటున్నారు నిపుణులు. ఇప్పటికైనా మేలుకొని పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.


