News July 27, 2024
ఒలింపిక్స్ టార్చ్ రెప్లికాతో మెగాస్టార్
పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్-2024 ప్రారంభ వేడుకల్లో హాజరైనందుకు సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి Xలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా భార్య సురేఖతో కలిసి ఒలింపిక్స్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న ఫొటోను ఆయన పంచుకున్నారు. భారత బృందంలోని ప్రతి క్రీడాకారుడు అద్భుత ప్రదర్శన కనబరచాలని ఆయన వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘GO INDIA.. జై హింద్’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 26, 2024
ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనున్న చైనా
ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో(బ్రహ్మపుత్ర) నదిపై దీన్ని నిర్మించనుంది. పూర్తైతే ఏడాదికి 300 బిలియన్ కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. దీని కోసం భారీగా నిధులు వెచ్చించనున్నట్లు బీజింగ్ వర్గాలు తెలిపాయి. బ్రహ్మపుత్ర నది భారత్‌లోని అరుణాచల్, అస్సాం రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్‌లోకి వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది.
News December 26, 2024
అజెర్బైజాన్ విమానాన్ని కూల్చేశారా?
అజెర్బైజాన్లో నిన్నటి విమాన ప్రమాదం రష్యా దాడి వల్లే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫ్లైట్ అజెర్బైజాన్లోని బాకు సిటీ నుంచి రష్యాకు వెళ్తుండగా కుప్పకూలింది. ఆ సమయానికి రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. విమానాన్ని ఉక్రెయిన్ దాడిగా పొరబడి రష్యా ఎయిర్ డిఫెన్స్ దాన్ని కూల్చేసి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. విమానం బాడీపై బులెట్ల ఆనవాళ్లుండటం దీనికి ఊతమిస్తోంది.
News December 26, 2024
అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది?: CM రేవంత్
TG: సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాతో కలిసి తిరిగాడు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టప్రకారం వ్యవహరించాలనేది నా విధానం’ అని రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో వ్యాఖ్యానించారు.