News December 3, 2024

మెగాస్టార్ న్యూ లుక్ అదిరిపోయిందిగా

image

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని షేర్ చేస్తూ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన నటించిన ‘విశ్వంభర’ ఫిబ్రవరిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. తర్వాతి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేయనున్నారు.

Similar News

News December 4, 2024

పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత్‌కు ALL THE BEST

image

మెన్స్ జూనియర్ ఆసియా కప్ హాకీ మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ ఇవాళ తలపడనున్నాయి. మలేషియాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో 3-1తేడాతో గెలవడంతో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాక్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత జట్టుకు ఫ్యాన్స్ ALL THE BEST చెబుతున్నారు.

News December 4, 2024

1983లోనే వాచ్‌లో టీవీ చూసే సదుపాయం!

image

అనలాగ్ వాచ్‌ నుంచి డిజిటల్ వాచ్‌లు రావడంతో మొబైల్ లేకుండానే కాల్స్, మెసేజ్‌లు చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది. అయితే, దీనికంటే ముందే 1983లో వచ్చిన SEIKO టీవీ వాచ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిలో ఎక్కడి నుంచైనా వాచ్ నుంచి టీవీని వీక్షించే సదుపాయం ఉండేది. ఇది అత్యంత చిన్న టీవీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకుంది. ఈ వాచ్‌ను 400 డాలర్లకు( 1983లో) విక్రయించేవారు.

News December 4, 2024

ఫ్యాన్స్‌తో ‘పుష్ప-2’ వీక్షించనున్న అల్లు అర్జున్!

image

‘పుష్ప-2’ సినిమాను తన అభిమానులతో చూసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు చేరుకుంటారని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈరోజు రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై సాయంత్రంలోపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, దీనికోసం నిర్వాహకులు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.