News December 3, 2024

మెగాస్టార్ తర్వాతి మూవీ ఇదే.. డైరెక్టర్ ఎవరంటే..

image

మెగాస్టార్ చిరంజీవి తర్వాతి సినిమాను హీరో నాని ట్విటర్లో అనౌన్స్ చేశారు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమా చేయనున్నట్లు తెలిపారు. ‘ఆయన్ను చూసి స్ఫూర్తి పొందాను. టిక్కెట్ల కోసం గంటల తరబడి లైన్లో ఉన్నాను. ఇప్పుడు ఆయన సినిమాను సమర్పిస్తున్నాను’ అని పేర్కొన్నారు. హింసలోనే అతడు శాంతి వెతుక్కుంటాడు’ అన్న ట్యాగ్‌లైన్‌తో ఉన్న ఈ సినిమాను SLV సినిమాస్, యునానిమస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి.

Similar News

News December 4, 2024

ఫ్యాన్స్‌తో ‘పుష్ప-2’ వీక్షించనున్న అల్లు అర్జున్!

image

‘పుష్ప-2’ సినిమాను తన అభిమానులతో చూసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు చేరుకుంటారని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈరోజు రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై సాయంత్రంలోపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, దీనికోసం నిర్వాహకులు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

News December 4, 2024

చుట్టూ సొరచేపలు.. అత్యంత ప్రమాదకరమైన హోటల్!

image

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన హోటల్ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఈ ఫ్రైయింగ్ పాన్ హోటల్ నార్త్ కరోలినా తీరానికి 32 మైళ్ల దూరంలో ఉంది. చుట్టూ ఉండే నీటిలో సొరచేపలుంటాయి. సముద్ర మట్టానికి 135 అడుగుల ఎత్తులో నాలుగు స్థంబాల సపోర్ట్‌తో దీనిని నిర్మించారు. ఇక్కడి చేరుకునేందుకు హెలికాప్టర్ లేదా బోట్ అందుబాటులో ఉంటాయి. ఇది ఒక లైట్‌హౌస్ ప్లాట్‌ఫామ్ కాగా, పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.

News December 4, 2024

కాకినాడ షిప్‌లో మరోసారి తనిఖీలు

image

AP: కాకినాడ పోర్టులో డిప్యూటీ CM పవన్ సీజ్ చేయించిన షిప్‌లో ఇవాళ మరోసారి తనిఖీలు చేస్తున్నారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సముద్రంలోకి బయల్దేరగా, రేషన్ బియ్యం నమూనాలు తీసుకోనుంది. బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి వచ్చింది? ఎంత మొత్తంలో ఉంది? తదితరాలపై కమిటీ నేడు వివరాలు సేకరించనుంది. పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ నేడు ఆ వివరాలను కలెక్టర్‌కు అందించనుంది.