News April 14, 2025
రూ.13వేల కోట్ల మోసం.. మెహుల్ ఛోక్సీ అరెస్టు

వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)ను మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. భారత ఏజెన్సీలైన CBI, ED విజ్ఞప్తి మేరకు అతడిని అరెస్టు చేశారు. ఛోక్సీపై గతంలో ముంబైలో నాన్-బెయిలబుల్ వారెంట్లు నమోదయ్యాయి. PNBని రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు రాగా ఛోక్సీ, నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. అతడి మేనల్లుడు నీరవ్ లండన్ జైలులో ఉన్నారు.
Similar News
News April 15, 2025
ప్రతీ ఎమ్మెల్యే రూ.25వేలు ఇవ్వాలి: రేవంత్

TG: పార్టీ అభివృద్ధికి ప్రతీ ఎమ్మెల్యే జీతం నుండి రూ.25 వేలు ఇవ్వాలని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని నేతలకు స్పష్టం చేశారు. పదవుల విషయంలో అద్దంకి దయాకర్లాగా ఓపికతో ఉండాలని చెప్పారు. ఓపికతో ఉన్నాడు కాబట్టే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడని తెలిపారు.
News April 15, 2025
నేషనల్ హెరాల్డ్ కేసు: ఛార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబె, ఇతర నేతల పేర్లను పేర్కొంది. దీనిపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 25న వాదనలను విననుంది. ఇప్పటికే ఈ కేసులో నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు నోటీసులు ఇచ్చింది.
News April 15, 2025
విశాఖలో TCSకు 21.16 ఎకరాలు కేటాయింపు

AP: విశాఖలో TCS(Tata Consultancy Services) సంస్థకు 21.16 ఎకరాల స్థలం కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎకరం 0.99 పైసల చొప్పున భూమిని ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీని ద్వారా TCS నుంచి రూ.1370కోట్ల పెట్టుబడులు, 12000 ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. TCSకు భూకేటాయింపు ద్వారా విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.